వైయస్ఆర్సీపీ నేతలకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Vijayawada

విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద డీఎస్సీ అక్రమాలను ప్రశ్నిస్తూ నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేత సుందర్‌పాల్, గుంటూరు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేంద్రలను మాచవరం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ తప్పుడు కేసులో అరెస్ట్ అయిన వైయస్ఆర్సీపీ నేతలకు తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు ఇలా అక్రమ కేసులు బనాయించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.