కోల్కతాలో సంచలనం: మమతా బెనర్జీపై హత్యాయత్నం చేసినట్లు టీఎంసీ తీవ్ర ఆరోపణలు

రిపోర్టర్: కృష్ణ స్థలం: కోల్‌కతా

పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై హత్యాయత్నం జరిగినట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. కాళీఘాట్లోని ఆమె నివాసం వెలుపల దుర్గాపూజ మండపం ప్రారంభోత్సవానికి వెళుతున్న సమయంలో ఒక యువతి కత్తితో దాడికి యత్నించినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆ మహిళను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.