రాజాం మున్సిపాలిటీలో వార్డుల పెంపు: ముసాయిదా జాబితా విడుదల చేసిన కమిషనర్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: రాజాం
విజయనగరం జిల్లా రాజాం పురపాలిక సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా గతంలో ఇరవై నాలుగుగా ఉన్న వార్డులను ముప్పై రెండుకు పెంచుతూ ముసాయిదా జాబితాను పురపాలక కమిషనర్ ఆకురాతి రామచంద్రరావు గురువారం విడుదల చేశారు. ఈ నెల పద్నాలుగు వరకు అభ్యంతరాలు స్వీకరించి, పదిహేనున పరిశీలించి, పదహారున తుది జాబితాను కలెక్టర్కు పంపనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.