పశ్చిమాసియా సంక్షోభంపై జర్మనీలో అమెరికా రహస్య అత్యున్నత భేటీ
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
జర్మనీలో అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఇరాన్ యుద్ధం మరియు ప్రాంతీయ భద్రతపై అత్యున్నత స్థాయి రహస్య సమావేశం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఏడు అరబ్ దేశాల సైనికాధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. హూర్ముజ్ జలసంధి పరిస్థితులు, హూతీ తిరుగుబాటుదారుల ముప్పును ఎదుర్కొనే సమన్వయ వ్యూహాలపై చర్చించారు. పశ్చిమాసియా నుంచి బలగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని అమెరికా స్పష్టం చేసింది.