ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా తిరుపతిలో వైద్య విద్యార్థుల భారీ అవగాహన ర్యాలీ

రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు స్థలం: తిరుపతి అర్బన్

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా తిరుపతి ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి మానసిక వైద్య విభాగం ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రవి ప్రభు, సూపరింటెండెంట్ డాక్టర్ బి. మనోహర్ జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో మానసిక సమస్యలపై కౌన్సెలింగ్ అవసరాన్ని నొక్కిచెప్పారు. మానసిక విభాగాధిపతి డాక్టర్ పద్మావతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.