స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఒత్తిళ్లు, అశాంతి పరిస్థితులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల గడువును పొడిగించాలని, తమ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసినట్లు నేతలు పేర్కొన్నారు. ఏకగ్రీవాల ప్రకటనలపై స్టే విధించాలని, ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని అత్యున్నత ధర్మాసనాన్ని అభ్యర్థించినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.