ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా బహుళ అంతస్తుల్లో టిడ్కో గృహాల నిర్మాణం
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంత పేదల కోసం కొత్తగా టిడ్కో గృహ సముదాయాలను బహుళ అంతస్తుల టవర్ల రూపంలో నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ మందికి ఇళ్లు అందించేలా జీప్లస్ 8 నుంచి జీప్లస్ 14 అంతస్తుల వరకు టవర్లను నిర్మించేందుకు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. కొత్తగా నిర్మించే ప్రతి ఫ్లాట్‌ను 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందించాలని భావిస్తుండగా, మౌలిక వసతులతో పాటు వాణిజ్య అవసరాల కోసం స్థల కేటాయింపులపై కసరత్తు జరుగుతోంది.