భారత్ వేదికగా బ్రిక్స్ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన బ్రిక్స్ సదస్సు 2026ను ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ సహా ప్రపంచ దేశాల అధినేతలకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు వెంటనే చేపట్టాలని, గ్లోబల్ సౌత్ దేశాలకు సముచిత స్థానం దక్కాలని ప్రధాని గట్టిగా డిమాండ్ చేశారు.