బ్యాంకు సిబ్బంది వేధింపులతో నెట్ సెంటర్ నిర్వాహకుడు ఆత్మహత్య

రిపోర్టర్: వెంకట్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్టకు చెందిన నూలు వీరవెంకటరామ త్రిమూర్తి సత్యేంద్రసతీష్‌ బ్యాంకు సిబ్బంది, డ్వాక్రా యానిమేటర్ వేధింపులు తాళలేక ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతి చెందే ముందు ఆయన సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ తన చావుకు బ్యాంకు సిబ్బంది, యానిమేటర్ కుమ్మక్కై కారణమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.