డీఎస్సీ నోటిఫికేషన్‌పై కసరత్తు: నెలాఖరులోగా ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశం
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
రాష్ట్రంలో డీఎస్సీ ప్రకటన విడుదలకు నెల రోజుల్లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో గురువారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా మిషన్ మార్చ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అలాగే యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.