సబర్మతి జైలులో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్: అత్యంత భద్రతా బ్లాక్లోకి మార్పు

రిపోర్టర్: సురేష్ స్థలం: అహ్మదాబాద్

అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉన్న కుఖ్యాత గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన రెండు వందల గదుల ప్రత్యేక బ్లాక్లోకి మార్చినట్లు అధికారుల వర్గాలు తెలిపాయి. గతంలో తీహార్తో పాటు పంజాబ్ జైళ్లలో ఉన్న సమయంలో అతడు బెదిరింపు కాల్స్ చేసిన నేపథ్యంలో, ఇతరులతో సంబంధాలు లేకుండా పూర్తిగా ఒంటరిగా ఉంచేందుకు ఈ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.