ఈశాన్య భారత్లో వీసా సేవలు సులభం: గౌహతిలో సరికొత్త కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: వెంకట్
స్థలం: గౌహతి
అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో సరికొత్త వీసా అప్లికేషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ వెల్లడించింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేతుల మీదుగా ఈ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు అంతర్జాతీయ ప్రయాణాలు మరింత సులభతరం చేసేందుకు ఈ అత్యాధునిక సౌకర్యం ఎంతగానో దోహదపడుతుందని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యుమ్మి తల్వార్ పేర్కొన్నారు. ఈ నూతన కేంద్రం ద్వారా ఏకంగా పద్నాలుగు దేశాలకు సంబంధించిన వీసా దరఖాస్తులను సులభంగా ప్రాసెస్ చేయనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.