నెల్లూరు మేయర్ బరిలో కోటీశ్వరులు: అభ్యర్థుల ఆస్తులు అప్పుల వివరాలు బహిర్గతం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Nellore

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్థానానికి పోటీ పడుతున్న తెలుగు దేశం పార్టీ మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరూ కోటీశ్వరులేనని అధికారులు తెలిపారు. నామినేషన్ పత్రాల సమయంతో సమర్పించిన అఫిడవిట్లలో వారి చరాచర ఆస్తులు, అప్పులు మరియు క్రిమినల్ కేసుల వివరాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. తెదేపా అభ్యర్థి పోలుబోయిన రూపకుమార్ యాదవ్ ఆస్తులు ఆరు కోట్ల ఇరవై లక్షలు ఉండగా, వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి ఆస్తులు మూడు కోట్ల డెబ్బై మూడు లక్షలుగా నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.