ఇరిగేషన్ శాఖలో పదోన్నతులకు గండికొడుతూ అధికారుల పొడిగింపులపై తీవ్ర వ్యతిరేకత
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
తెలంగాణ ఇరిగేషన్ శాఖలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులకు వరుసగా ఎక్స్టెన్షన్లు ఇస్తుండటంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎన్సీ జనరల్‌గా రమేశ్‌బాబు పదవీకాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శాఖలో అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ పదోన్నతులు ఇవ్వకుండా పాతవారినే కొనసాగించడం అన్యాయమని ఉద్యోగులు వాపోతున్నారు.