బాన్సువాడలో నాటు బాంబుల పేలుడు కలకలం: ఏడుగురికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: బాన్సువాడ

బాన్సువాడ పట్టణంలోని ఎర్రమన్ను కుచ్చా ప్రాంతంలో ఆదివారం నాటు బాంబులు ఒక్కసారిగా పేలడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పందుల వేట కోసం మోపెడ్ లో నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.