కర్ణాటకలో బాలికకు అసభ్యకర వీడియోలు చూపిన వ్యక్తి అరెస్ట్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కర్ణాటక

కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్ళిలో దారుణం చోటుచేసుకుంది. పదేళ్ల బాలికకు తన మొబైల్ ఫోన్‌లో అసభ్యకర కంటెంట్ చూపిన మజిద్ నదాఫ్ అనే ముప్ఫై ఎనిమిదేళ్ల దినసరి కూలీని ఓల్డ్ హుబ్బళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాలకు వెళ్లే మార్గంలో బాలికతో పరిచయం పెంచుకున్న నిందితుడు, ఆమెకు డబ్బులు ఆశ చూపి ఈ అరాచకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.