సమస్యలు పరిష్కరించాలంటూ ఆదిలాబాద్ లో ఎన్హెచ్ఎం ఉద్యోగుల వినూత్న నిరసన
రిపోర్టర్: రమేష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు గత ఇరవై రెండు రోజులుగా విధులు బహిష్కరించి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారని జేఏసీ జిల్లా అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంగళవారం వారు సమ్మె శిబిరం వద్ద ఎన్హెచ్ఎం ఇంగ్లీషు అక్షరాల ఆకారంలో కూర్చుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని ఆయన తీవ్రంగా డిమాండ్ చేశారు.