వాహనదారులకు భారీ షాక్: ఆర్టీఏ సేవలకు ఏడాది బీమా తప్పనిసరి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Hyderabad
వాహన సేవలు పొందాలంటే కచ్చితంగా ఏడాది బీమా ఉండాలని ఆర్టీఏ అధికారులు స్పష్టం చేశారు. ఒక నెల ఇన్సూరెన్స్ తో ఫిట్నెస్ పొందే విధానానికి స్వస్తి పలికినట్లు అధికారులు తెలిపారు. ఐఐబీ పోర్టల్ ద్వారా పాలసీలను పరిశీలించి ఆమోదం తెలపాలని ఆదేశించారు. గడువు లేని వాహనాలను నిఘా జాబితాలో చేర్చి కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.