ఏలూరు గంగానమ్మ ఆంథెమ్ ఆవిష్కరణ: రాష్ట్రంలో భక్తి గీతం సంచలనం
రిపోర్టర్: రమేష్
స్థలం: Eluru
నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన ఏలూరు గ్రామ దేవత శ్రీ గంగానమ్మ తల్లి వైభవాన్ని తెలిపే భక్తి గీతాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. తరంగిణి ఒరిజినల్స్ యూట్యూబ్ ఛానెల్ లో విడుదలైన ఈ ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని సత్యవతి మోటేపల్లి, దారపు ఛాయాదేవి తెలిపారు. సాయి తేజ మోటేపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ వీడియో పాట సంస్కృతిని ప్రతిబింబిస్తోందని నిర్వాహకులు వెల్లడించారు.