కడెం సాగునీటి కోసం రోడ్డెక్ కి కదంతొక్కిన జన్నారం అన్నదాతలు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామ సమీపాన ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. కడెం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు చివరి భూములకు నిరంతరం సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. పంటలు పొట్ట దశలో ఉన్నందున నీటి సరఫరా నిలిపివేయవద్దని స్పష్టం చేశారు.