మంచిర్యాలలో రౌడీషీటర్ల ఇళ్లపై అర్ధరాత్రి ఆకస్మిక దాడితో పోలీసుల హెచ్చరిక

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలక్నగర్లో గురువారం అర్ధరాత్రి రౌడీ షీటర్ల ఇళ్లలో డీసీపీ ఎ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.