నైపుణ్యాలతోనే యువత ఉజ్వల భవిష్యత్తు సాధించగలరన్న ఎమ్మెల్సీ తాతా మధుసూదన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఖమ్మం అర్బన్
సాంకేతిక, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకున్నప్పుడే పోటీ ప్రపంచంలో యువత రాణిస్తారని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. ఖమ్మంలో ఐటీ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. సాంకేతికతను నైపుణ్యాభివృద్ధికి సాధనంగా మలచుకోవాలని సూచించారు. గ్రామీణ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.