నిమ్స్ అడిషినల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లపై ఏసీబీ సోదాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో అడిషినల్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి ముమ్మర సోదాలు చేపట్టారు. మూడు జిల్లాల్లోని మొత్తం 12 ప్రాంతాల్లో ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాలు, బంధువులు మరియు సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఈ ఆకస్మిక దాడులు కొనసాగుతున్నాయి. గతంలోనూ భూ లావాదేవీలు, నిధుల మళ్లింపు వంటి పలు ఆరోపణలు ఎదుర్కొన్న లక్ష్మీభాస్కర్‌కు సంబంధించి కీలక పత్రాలు, లెక్కకు మించిన నగదును అధికారులు పరిశీలిస్తున్నారు.