యువకుల సేవా గుణం: ఆపదలో ఉన్నవారికి భరోసానిస్తూ ఆదర్శంగా మారుతున్న వైనం
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
గండిపాలెం గ్రామానికి చెందిన యువకులు సేవా గుణం పేరుతో ఫౌండేషన్ను స్థాపించి ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. క్యాన్సర్ బాధితులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు స్వచ్ఛ భారత్, వైద్య శిబిరాలు, విద్యా సామగ్రి పంపిణీ వంటి పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తుపానులు మరియు వరద బాధితులను సైతం ఆదుకుంటూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.