కాకినాడ పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: కాకినాడ
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అడిషనల్ ఎస్పీ ఎస్. శ్రీనివాసరావు పాల్గొని విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన విశ్వకర్మ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.