పెద్దపల్లి జిల్లాలో ఆధార్ సేవలను పారదర్శకంగా అందించాలన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష

రిపోర్టర్: మహేష్ స్థలం: Peddapalli

పెద్దపల్లి జిల్లాలో ఆధార్ సేవలను మరింత పారదర్శకంగా మరియు వేగవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. నూతన ఆధార్ నమోదులు, మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ల ప్రక్రియను అధికారులు మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా పెండింగ్ దరఖాస్తులు ఉండకుండా త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు.