ప్రాణహిత పవనాల నడుమ ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. స్థానిక కోట జంక్షన్ వద్ద నాయకులు ఆశీర్వాద దీపాలు వెలిగించి ప్రధానికి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో విలసిల్లాలని ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కరణం సూర్యతేజ, కంది మురళీనాయుడు తదితరులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.