తిరుమలలో వైభవంగా ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే రేపు రాత్రి ధ్వజావరోహణతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు అధికారికంగా ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా నిలిపివేసిన ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఎల్లుంటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఎల్లుండి సాయంత్రం నుంచి తిరుపతిలో సర్వదర్శనం టోకెన్ల జారీని తిరిగి ప్రారంభించనున్నట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి.