సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల నిందితుడికి బెయిల్ నిరాకరణ
రిపోర్టర్: రాము
స్థలం: ముంబై
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటన నిందితుడు విక్కీకుమార్ గుప్తాకు ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించిందని అధికారులు వెల్లడించారు. బీహార్ లోని సొంతూరిలో జరగనున్న తమ్ముడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు అతడు తాత్కాలిక బెయిల్ కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. అయితే జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివాహ వేడుకలో పాల్గొనేందుకు కోర్టు వెసులుబాటు కల్పించిందని పోలీసులు తెలిపారు.