ఇండోనేషియాలో విమానాశ్రయాలు పునఃప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: World

అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా ఇండోనేషియాలో నిలిచిపోయిన విమాన సర్వీసులు మంగళవారం పునఃప్రారంభమయ్యాయి. అనక్ క్రాకటౌ అగ్నిపర్వతం బూడిద వ్యాపించడంతో జకార్తాలోని ప్రధాన విమానాశ్రయాలతో పాటు పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రవాణా శాఖ మంత్రి దూదీ పుర్వగంధీ ఆదేశాల మేరకు సుకర్నో-హట్టా సహా పలు విమానాశ్రయాలు తిరిగి తెరుచుకున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా గాలి దిశను బట్టి అధికారులు రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.