సింగారంలో బెల్ట్ షాపులపై ముమ్మరంగా సోదాలు చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం సింగారం గ్రామంలో ఆలేరు ఎక్సైజ్ సీఐ జి. నాగ లత ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఫిర్యాదు మేరకు గ్రామంలోని పలు ఇండ్లు, దుకాణాలలో సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అక్రమ మద్యం నిల్వలు మరియు విక్రయాలు లేవని ఈ తనిఖీలలో స్పష్టమైనట్లు వారు వెల్లడించారు.