కొండా సురేఖ తొలగింపు వెనుక భారీ భూ కుంభకోణం: కేటీఆర్

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడం వెనుక సీఎం రేవంత్ రెడ్డి సోదరుల భూ అక్రమాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ అవినీతిని సురేఖ కుమార్తె బయటపెట్టడంతోనే ఆమెపై వేటు వేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో 22ఏ నిషేధిత భూముల జాబితా కోటి 16 లక్షల ఎకరాలకు పెరిగిందని, రాష్ట్రంలో దేశంలోనే అతిపెద్ద భూ కబ్జా పర్వం సాగుతోందని ధ్వజమెత్తారు.