'కాంగ్రెస్ను బద్నాం చేస్తున్నారు': జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఫైర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
22-ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ శాసనసభలో మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం ఈదుల నాగులపల్లిలో ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపర్ చేసి, సుమారు 150 ఎకరాలను సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్తో పాటు కొందరికి అంటగట్టారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నవీన్ యాదవ్ డిమాండ్ చేశారు.