అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ఏమో ఏమో ఇది విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రం ఏమో ఏమో ఇది. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.