తిరుపతి మహిళ అద్భుత ప్రస్థానం: కోటి టర్నోవర్తో చెక్క శిల్పాల వ్యాపారం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుపతి
భర్త మరణం తర్వాత తిరుపతికి చెందిన చంద్రకళ చెక్క శిల్పాల వ్యాపారాన్ని చేపట్టి అద్భుత విజయాలను సాధించారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నివేదించింది. పీఐబీ వెల్లడించిన వివరాల ప్రకారం లోటస్ స్వయం సహాయక సంఘం సహాయంతో ఆమె ఈ కుటీర పరిశ్రమను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక టర్నోవర్ కోటి రూపాయలకు పైగా చేరుకుందని, నూరుగురికి పైగా ఉపాధి లభిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.