అన్నదాతలకు తీపి కబురు: పశుగ్రాస సాగు కోసం భారీ ఆర్థిక సాయం

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తిన పశుగ్రాస కొరతను నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. సొంత భూముల్లో పశుగ్రాసం సాగు చేసే ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులకు ఎకరాకు గరిష్టంగా అరవై తొమ్మిది వేల ఏడువందల ఎనభై ఒక్క రూపాయల వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. పశువుల సంఖ్య ఆధారంగా సాగు భూమి విస్తీర్ణం ఉంటుందని స్పష్టం చేశారు.