వైద్య విద్యలో ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

రిపోర్టర్: సునీల్ స్థలం: విజయవాడ

విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయే పాలనలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఎంబీబీఎస్, పీజీ సీట్లు భారీగా పెరిగాయని వివరించారు. వైద్య విద్యార్థులు అధునాతన పరిశోధనలపై దృష్టి సారించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారాలు కనుగొనాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు.