తెలంగాణలో ముగ్గురు కొత్త డీసీసీ అధ్యక్షులను నియమించిన కాంగ్రెస్ హైకమాండ్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు జిల్లా కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షులను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ నియామకాలను ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పటోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఎండీ ముస్తఫా నియమితులయ్యారు.