మతసామరస్యం చాటుతూ గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం యువకుడు

రిపోర్టర్: రాము స్థలం: జగిత్యాల

జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లెలో గణేష్ లడ్డూ వేలం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. టీం సెవెన్ యూత్ గణేష్ మండపంలో నిర్వహించిన వేలంలో ముస్లిం యువకుడు మహ్మద్ ఇషాత్ డెబ్బై వేల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు. ప్రముఖ గాయకుడు ఎండీ అభి కుమారుడైన ఇషాత్ బాల్యం నుంచే వినాయక నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో పాల్గొంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.