వర్ధన్నపేట పాక్స్ డైరెక్టర్లను ఘనంగా సత్కరించిన నందిపాక భాస్కర్

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన దొమ్మటి రాజన్న గౌడ్, కొండేటి మహేందర్, బక్కతట్ల రాజ్ కుమార్లను నందిపాక భాస్కర్ ఘనంగా సత్కరించారు. గురువారం జరిగిన కార్యక్రమంలో వారికి శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి నూతన డైరెక్టర్లు అందరూ అంకితభావంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.