'ఎంఎస్ అమ్మ పాత్రలో నటించడం అదృష్టం': చెన్నైలో సుబ్బులక్ష్మి బయోపిక్ లాంఛనం

రిపోర్టర్: శివ స్థలం: చెన్నై

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి జీవిత కథతో గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. సుబ్బులక్ష్మి 116వ జయంతిని పురస్కరించుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ఎంఎస్ అమ్మ పాత్రలో రష్మిక నటిస్తుండగా, కమల్‌ హాసన్‌ క్లాప్‌నిచ్చారు. అల్లు అరవింద్, రాక్‌లైన్‌ వెంకటేశ్, బన్నీ వాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.