యమునా నది శుభ్రత కోసం రంగంలోకి దిగిన సురేంద్ర సింగ్
రిపోర్టర్: మహేష్
స్థలం: Delhi
మధ్యప్రదేశ్ లోని అజ్నార్ నదిని శుభ్రం చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి తాజాగా దిల్లీలోని యమునా నదిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించిన ఈ మెగా క్లీనప్ డ్రైవ్ లో ఆయనతో పాటు స్థానికులు, వాలంటీర్లు కలిసి సుమారు నాలుగున్నర గంటల పాటు శ్రమించి 585 కిలోల వ్యర్థాలను తొలగించారు.