హైదరాబాద్లో డోర్డాష్ గ్లోబల్ టెక్ హబ్ ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లో ప్రముఖ డోర్డాష్ సంస్థ కొత్తగా గ్లోబల్ టెక్నాలజీ హబ్ను ప్రారంభించినట్లు రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ నూతన కేంద్రం ద్వారా వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు మూడు వేల ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీ, కస్టమర్ సపోర్ట్, డేటా విభాగాల్లో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రంలో మరిన్ని జీసీసీల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు.