సంపూర్ణేష్ బాబు రూపంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు 'ది ప్యారడైజ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సంపూ రూపంపై జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సంపూర్ణేష్ బాబును కించపరిచేలా మాట్లాడటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తడవడంతో జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ స్పందించి, సంపూర్ణేష్ బాబుకు అలాగే అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు.