టెస్ట్ క్రికెట్ కు గుడ్‌బై చెప్పిన మహ్మద్ షమీ: షాక్ లో ఫ్యాన్స్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతున్నట్లు టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ నిర్ణయాన్ని వెల్లడించిన ఆయన, బరువైన హృదయంతో సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తన పదమూడేళ్ల టెస్టు కెరీర్ లో అనేక మధురానుభూతులు, ఎత్తుపల్లాలు చూశానని తెలిపారు. భవిష్యత్తులో వన్డే, టీ20 మ్యాచ్ లతో పాటు ఫిట్ నెస్ కోసం దేశవాళీ క్రికెట్ లో కొనసాగుతానని మహ్మద్ షమీ వెల్లడించారు.