డిజిటల్ చెల్లింపుల వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన హైదరాబాద్ నగరం
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
నగదు రహిత డిజిటల్ చెల్లింపుల వినియోగంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు అమెజాన్ పే, పహ్లే ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదికలో వెల్లడించినట్లు పేర్కొన్నారు. నగరంలో వినియోగదారులు చేస్తున్న మొత్తం ఖర్చులో ది ఆరు శాతం డిజిటల్ పద్ధతుల్లోనే జరుగుతోందని, రెస్టారెంట్లు, ప్రయాణాలు, నిత్యావసర కొనుగోళ్లలో యూపీఐ లావాదేవీలు రోజువారీ జీవితంలో కీలక భాగంగా మారాయని నివేదిక స్పష్టం చేసింది.