పూడిమడక సముద్ర తీరంలో అలల తాకిడికి యువకుడు మృతి

రిపోర్టర్: I am Farmer 🍅🌱 స్థలం: అచ్యుతాపురం

మతిస్థిమితం లేని యువకుడు సముద్రంలో మునిగి మృతిచెందాడు. కోణంపాలెం గ్రామానికి చెందిన లాలం లక్ష్మణరావు సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి పూడిమడక సముద్రంలోకి వెళ్లాడు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో బలమైన అలల తాకిడికి సముద్రంలో మునిగిపోయాడు. మంగళవారం పూడిమడక తీరానికి చేరిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.