వ్యవసాయ రంగంలో విస్తరిస్తున్న కిసాన్ డ్రోన్ల సాంకేతికత సేవలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: India

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగం పుంజుకుంటోంది. పంటలకు పురుగుమందులు, ఎరువుల పిచికారీతో పాటు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. కిసాన్ డ్రోన్ల ప్రోత్సాహానికి ఇప్పటివరకు రూ.141.39 కోట్లు విడుదల చేయగా, రైతన్నలకు 527 డ్రోన్లు అందించడంతో పాటు 1,595 డ్రోన్ కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ మహిళలు, యువతకు ఉపాధి కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది.