మూడు ట్రిప్పులకే ప్రయాగ్రాజ్ - విశాఖ ప్రత్యేక రైలు రద్దు!
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రయాగ్రాజ్ టు విశాఖపట్నం ప్రత్యేక రైలు కేవలం మూడు ట్రిప్పులకే నిలిచిపోవడం ప్రయాణికులకు తీవ్ర నిరాశ కలిగించింది. అపూర్వమైన ఆదరణ లభిస్తున్నప్పటికీ సాంకేతిక కారణాలు మరియు నిర్వహణ లోపాలతో రైలును రద్దు చేయడంపై ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైలును పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.