హుస్సేన్ సాగర్ వద్ద ముమ్మరంగా కొనసాగుతున్న చెత్త సేకరణ పనులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ వద్ద చెత్త సేకరణ మరియు శుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జీహెచ్ఎంసి అధికారులు తెలిపారు. నగర వాసులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మూడు షిఫ్టుల్లో పదిహేను వేల మంది కార్మికులను రంగంలోకి దించి ఈ పనులను వేగవంతం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రోజువారీగా పేరుకుపోతున్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీటి నాణ్యతను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పర్యావరణాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పనులను నిరంతరం కొనసాగిస్తున్నామని వెల్లడించారు.